సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 07, రామకృష్ణాపూర్: సింగరేణి కార్మికుల డిమాండ్లపై ఏఐటియుసి యూనియన్ పిలుపుమేరకు మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో యూనియన్ ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ ఆధ్వర్యంలో సిహెచ్పి లో ధర్నా కార్యక్రమం వహించారు. ఏఐటియుసి యూనియన్ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు. సింగరేణి కార్మికుల యొక్క పలు డిమాండ్లతో కూడిన మెమొరాండం ను సిహెచ్పి ఇన్చార్జ్ ఏ చంద్రమౌళికి అందించారు. మెమోరాండంలో తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఫిట్ సెక్రెటరీ హరి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిరాజ్ ,అబ్బాస్, నరేంద్ర ,రామారావు, శ్రీనివాస్, నరేందర్, శ్రీకాంత్, రవళి, వైష్ణవి, భవాని, అనిత, రజిత తదితరులు పాల్గొన్నారు.