సాక్షి డిజిటల్: నవంబర్ 6, అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పరిధిలోని, మందలపల్లి గ్రామం, శ్రీరామ్ నగర్ కాలనీ లో రామాలయం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామ పెద్దలు భక్తులు యొక్క ఆధ్వర్యంలో, దీపారాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొని,పూజలు దీపాలు వెలిగించి, ప్రత్యేకంగా స్వామి వారిని అలంకరించి, అభిషేకాలు అర్చనలు,నిర్వహించారు, శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించి నందున విశేషంగా ఆకర్షించాయి, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవదేవునికి చేసినటువంటి పూజలను కార్యక్రమాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ కమిటీ సభ్యులు, రామాలయ పూజారి,ఈ కార్యక్రమంలో, భక్తులు పాల్గొన్నారు.