కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్షులు పదవి కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవెంద్రప్ప ఇవ్వాలి

★యం.డి. హళ్లి సర్పంచ్ క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర్

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద నవంబర్ 7, కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్షులు పదవి కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవెంద్రప్ప ఇవ్వాలనీ యం.డి. హళ్లి సర్పంచ్ క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర్ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీకి అన్ని విధాలుగా సేవ చేస్తూ సర్పంచ్ గా, ఎంపీపీ గా, జడ్పీటీసీ గా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, జిల్లా ఉపాధ్యక్షుడు గా, రాష్ట్ర కార్యదర్శి గా, జిల్లా లోని బీసీ లలో బలమైన నాయకునిగా ప్రస్తుతం ఏపీ కురువ కార్పొరేషన్ చైర్మన్ గా సేవలాందిస్తున్న దేవెంద్రప్ప టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని వరు కోరారు కర్నూలు జిల్లాలోని కురువ కులస్థులు అత్యధికంగా ఉన్నారని జిల్లా లో 25 ఏళ్లుగా టీడీపీ ఎంపీ గా గెలవని సీట్ ను కురువ కులస్థులు అందరూ ఐక్యమాత్యం తో జిల్లాలో ఎమ్మెల్యే ల కన్న 40000 వేల మెజారిటీ ఓట్లతో ఎంపీ ని గెలిపించుకున్నామని సర్పంచ్ సుధాకర్ తెలిపారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అధిష్టానం ఎప్పటికి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.