సాక్షి ,డిజిటల్ న్యూస్, నవంబర్ 7, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్టు, బూర్లరాజు,,
హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రభుత్వ మాజీ విప్ ఆరేపల్లి మోహన్ జోస్యం చెప్పారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ,కె.ఆర్ నాగరాజు, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే, సంపత్ కుమార్ లతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు, అడుగడుగునా మహిళలు జనం కాంగ్రెస్ పార్టీ కి బ్రహ్మరథం పట్టడం జరుగుతుందన్నారు, కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థి నవీన్ యాదవ్ కు రాష్ట్ర మంత్రులకు మహిళలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నట్లు ఆయన చెప్పారు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం,చేపట్టిన సంక్షేమ పథకాల అమలు, ప్రతి ఇంటికి సన్న బియ్యం, ప్రతి పేద లబ్ధిదారుని, రేషన్ కార్డు మంజూరు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పై ప్రజల్లో భారీ స్పందన ఉందన్నారు, , ఇలాంటి పరిణామాలతో ప్రతి కార్యకర్త ,ఎమ్మెల్యేలు , పలువురు మంత్రులు, కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు రోజు రోజుకు కుల సంఘాలు, మహిళలు, వ్యాపార వర్గాలు, దళితులు మైనార్టీ, బీసీ, వర్గాలు యువకులు ,సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు, నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు పొందడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు