ఆటో వాహన చోదకులపై పోలీసులు కొరడా

★ఐదు ఆటోలను సిజ్ చేసి వాటిపై కేసు నమోదు ★పరిమితికి మించిన ఆటో ప్రయాణం ప్రమాదకరం : ఎస్​ఐ నిరంజన్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 7, పెద్దకడబురు, మంత్రాలయం తాలూకా కర్నూల్ జిల్లా, రిపోర్టర్ గుడిసె శివరాజ్ : మండల కేంద్రంలోని ఆటో వాహన చోదకులు నిబంధనలను తుంగలోకి తొక్కి పరిమితికి మించి అధిక సంఖ్యలో ప్రయాణికులతో, కూలీలను మరియు విద్యార్థులను తీసుకోని వెళ్తున్న ఐదు ఆటో లను సీజ్ చేసి వాటిపై కేసు నమోదు చేసినట్టు ఎస్​ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఎస్​ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రజా రవాణాలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. కావున ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఎక్కువ సంఖ్యలో ఎక్కించుకొని పోయే వారి పైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు