అవినీతి రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలి కలెక్టర్రాహుల్ రాజ్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 07 మెదక్ ఇంచార్జి బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారదులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలపట్లజాలి,కరుణావృత్తిపట్ల నిబద్ధత ఉండాలిఉద్యోగులందరూ నీతి నియమాలని అనుసరించాలి వివిధ శాఖల్లో పేరుకు పోతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంపారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకుమెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవినీతిని అంతమొందించి జిల్లాలో పారదర్శకత పాలనే లక్ష్యంగా ముందుకు పోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎవరైనా అధికారులు, లేదా వాళ్ల సిబ్బంది , అధికారులకు అవినీతి ఆలోచన ఉంటే విరమింప చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులకు సూచించారు. ప్రజల పట్ల ఉద్యోగులు జాలి కరుణ కలిగి ఉండి వృత్తిపట్ల నిబద్ధతగా ఉండాలన్నారు. పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతామన్నారు. ఉద్యోగులందరూ నీతి నియమాలు అలవర్చుకోవాలని సూచించారు. వీరి శాఖలో పేరుకు పోతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ప్రభుత్వ ఉద్యోగులేనని తెలిపారు. అధికారులందరూ ఏకధాటిగా అవినీతిపై ఉక్కు పాదం మోపాలన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం అవినీతిపై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో , జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఏ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు, మెదక్ ఆర్డిఓ రమాదేవి ,అధికారులు, ఉన్నారు.