అనాధ వృద్ధ మహిళలకు నిత్యవసర సరుకులు పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద నవంబర్ 7, అనాధ వృద్ధ మహిళలకు, వికలాంగులకు, స్వామి వివేకానంద ట్రస్ట్ ఆదోని, భారత్ యూత్ అసోసియేషన్ హోళగుంద వారి ఆధ్వర్యంలో గత 46 నెలల నుండి నిత్యవసర సరుకులు అందజేయడం గ్రూప్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైన హోటల్ ఈరన్న,ఎర్రమ్మ దంపతులకు,మార్లమడికి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మ, అంద వికలాంగుడు అయినటువంటి మడ్డీ లక్ష్మన్న, హోళగుంద గ్రామానికి సేవలందిస్తున్నటువంటి గుర్క నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల నిత్యవసర సరుకులను ప్రతి ఒక్కరి సహకారంతో అందజేయడం జరుగుతుందని గ్రూప్ సభ్యులు తెలిపారు గ్రామంలో తమకు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు