సాక్షి డిజిటల్ నవంబర్ 6 భైంసా (నిర్మల్ జిల్లా) ముధోల్ నియోజకవర్గం లో హమ్ పథకం కింద 25 రోడ్ల నిర్మాణానికి మొదటి దశలో నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. బుధవారం హైదరాబాద్ నుండి అయన ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ప్రారంభించి, పనులు చేపడుతుందన్నారు.దార్ కుభీర్ టూ బ్రహ్మేశ్వర్ ( 7.30 కి. మీ.) రంజని తాండ వయా జామ్ గాంవ్ అండ్ రంజని (6.70 కి. మీ. )నేషనల్ హైవే నుండి భోసి (2.05 కి. మీ.) హంగిర్గా నుండి దహెగాం( 4.70 కి. మీ.)మొగిలి టూ జాల వయ మాసల్గా కళ్యాణ్ (7.40 కి. మీ.)జె ఎస్. రోడ్ టూ హిప్నెల్లి తండా (4.50కి. మీ) జె. ఎస్. రోడ్ టూ ఝరి వయ వడ్ఝరి (7.47 కి. మీ.)ముధోల్ టూ ఎల్వత్(2.10కి. మీ)గన్నోరా టూ సురేల్లి వయా కీర్గుల్, ఓని. కౌట, సాలాపూర్ (11.00కి. మీ)జడ్. పి. రోడ్ టూ ఎడ్ బిడ్ వయా కారేగాం (4.50కి. మీ.) ముధోల్ టూ ధర్మబాద్ అప్ టూ ఎల్వత్ (7.60 కి. మీ.) మీర్జాపూర్ టూ సిద్దూర్ ( 2.10.కి. మీ.) తిమ్మాపూర్ టూ ఓలా(2.70.కి. మీ. )ఓలా టూ అంబుగామ్, మదన్ పూర్, పంగర్ పహాడ్( 9.50 కి. మీ)ఎస్. ఆర్. ఎస్. పి. రోడ్ లోకేశ్వరం వయా మన్మధ్ (6.45కి. మీ.)పోట్పెల్లి బి. టూ లోకేశ్వరం (10కి. మీ.)మన్మధ్ జడ్. పి రోడ్ టూ నగర్ ( 3.94 కి. మీ.) వటో లి రాయపూర్ కాండ్లి టూ అర్లి ( 5.91కి. మీ) సేవాలాల్ తండా టూ హావర్గ (8.60 కి. మీ.)తరోడా టూ రాయపూర్ కాండ్లి వయా ఎడ్ బిడ్.తండా ( 5.30 కి. మీ.)బామ్ని వయా తురాటి (3.70కి. మీ.)అర్లి కె టూ వయా డొంగర్గావ్ టూ ఓల్డ్ దొంగర్గాం (4.80 కి. మీ.) నందన్ టూ తురాటి (2.29 కి. మీ.) రోడ్లను నిర్మించనున్నామని తెలిపారు. ఆదే విధంగా ఆర్ అండ్ బి పరిధిలో పెద్ద మొత్తంలో రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. *300 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలప్రణాళికలు రూపొందించమన్నారు. మొదటి దశలో ముధోల్ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత నిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు.