చింతకాని సాక్షి డిజిటల్ ప్రతినిధి గోపీనాథ్, ఇటీవల దారుణ హత్యకు గురైన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్, సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా పరామర్శించారు. బుధవారం నాడు మండల బీ.ఆర్.యస్ పార్టీ నాయకులు మంకెన రమేష్, వంకాయలపాటి లచ్చయ్య, గురిజాల హనుమంతరావు, బొడ్డు వెంకట్రామయ్య, సామినేని అప్పారావు, పాపిటి రంగారావు, సామినేని బాబురావు, గడ్డం శ్రీనివాసరావు, వేముల నర్సయ్య తదితరులు రామారావు నివాసానికి వెళ్లిన సందర్భంలో అక్కడ నుండి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కు ఫోన్ చేసి రామారావు కుమారుడు సామినేని విజయ్‌తో మాట్లాడించారు. మాజీ ఎంపీ నామ వారితో మాట్లాడుతూ జరిగిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, కుటుంబ సభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. రామారావు వంటి సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోవడం అటు పార్టీకి, ప్రజా ఉద్యమానికి పెద్ద నష్టం అని అన్నారు. తనతో ఫోన్లో మాట్లాడిన రామారావు కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కల్పించారు. రామారావు హత్యను నామ తీవ్రంగా ఖండిస్తూ, దోషులను త్వరితగతిన పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు.ప్రజా నాయకులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని నామ ఆకాంక్షించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు