సాధారణ సేల్స్‌మెన్ నుండి మేనేజర్ పీఠం వరకు కృషికి దక్కిన గౌరవం!

★జి.సి.సి. మేనేజర్ భూర్క యాకయ్యకు మిత్రలాభ కుటుంబం అపూర్వ సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్(కొండూరిప్రకాష్)నవంబర్6 గంగారం:-కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఈ మాటలను నిజం చేస్తూ కేవలం వృత్తి నిబద్ధత అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి భూర్క యాకయ్య.సాధారణ జి.సి.సి సేల్స్‌మెన్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ఈరోజు ములుగు జిల్లా జి.సి.సి.మేనేజర్ పదవి వరకు సాగింది. ఆయన ఈ ఉన్నత శిఖరాన్ని అధిరోహించడం యాకయ్య కుటుంబానికే కాక,ఆయన మిత్రులు,శ్రేయోభిలాషులందరికీ గర్వకారణంగా నిలిచింది.ఈ నేపథ్యంలో,గంగారం మండల కేంద్రంలో భూర్క యాకయ్య మరియు నాగలక్ష్మిని మిత్రలాభ కుటుంబ సభ్యులు అత్యంత ఆత్మీయంగా సన్మానించారు.యాకయ్య క్రమశిక్షణ,పనితీరు తమకెంతో స్ఫూర్తిని ఇచ్చిందని కుటుంబ సభ్యులు, మిత్రులు ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.ఆయన చూపిన వృత్తి నిబద్ధత తమ అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ సన్మానం కేవలం పదవికి దక్కిన గౌరవం మాత్రమే కాదని,ఆయన పట్టుదలకు,నిరంతర శ్రమకు దక్కిన ప్రతిఫలమని వక్తలు పేర్కొన్నారు.మిత్రలాభ కుటుంబ అధ్యక్షులు ఇర్ప బుచ్చి రాములు,ప్రధాన కార్యదర్శి మొల్కం లక్ష్మినర్సుతో పాటు ముడిగ రామచందర్, సువర్ణ పాక పాపారావు, ఇర్ప అనంతరావు, చుంస సారయ్య, ఈసం క్రిష్ణ, జెజ్జరి లక్ష్మినర్సు, మోకాళ్ళ సమ్మయ్య, చుంచ మహెందర్, చుంచ శ్రీనివాస్, వాసం కొమ్మయ్య, ఈసం శ్రీనివాస్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు.