శ్రీ శ్రీ భక్త కనకదాసు 538వ జయంతి ఘనంగా నిర్వహించుకోవాలి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద నవంబర్ 6, శ్రీ శ్రీ భక్త కనకదాసు 538వ జయంతి ఘనంగా నిర్వహించుకోవాలని హొళగుంద మండలం గౌరవాధ్యక్షులు కాలిక ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ భక్త కనకదాస్ 538వ జయంతి సందర్భంగా ఆలూరు ని యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం జరుగబోయి శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతిని మాదాసి మాదారి కురువ కులస్తులందరూ ఐక్యంగా కలిసిమెలిసి ఘనంగా కనకదా జయంతిని జరుపుకోవాలని హొళగుందా మండలం గౌరవాధ్యక్షులు కాలిక ప్రసాద్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం 538 వ జయంతి జరుపుకోవడానికి ప్రత్యేక జీవ విడుదల చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని విద్య సంస్థలలో అన్ని సచివాలయాల్లో కనకదా జయంతి నిర్వహించే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలనీ కోరారు, ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్కే గిరి,మాధసి కురువ సంగం ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహ్యట మల్లయ్య, గాదిలింగప్ప, వీరభద్రప్ప, మల్లికార్జున, ముద్దటమాగి, ఆనంద్, వీరేష్, మాదారి మాదాసి కురువ కులస్తులు పాల్గొన్నారు