సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 6, పెద్దకడబురు, మంత్రాలయం తాలూకా కర్నూల్ జిల్లా, రిపోర్టర్ గుడిసె శివరాజ్ : మండల కేంద్రంలోని నవంబర్ 8న కురువ సంఘం ఆధ్వర్యంలో కురువుల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీ భక్త కనకదాస్ 538వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నట్టు పొట్టేలు మరియు నల్ల పొట్టేలు పందెం నిర్వహించబడుతుందని కురువ సంఘం పెద్దలు తెలిపారు.ఈ సందర్భంగా కురువ సంఘం పెద్దలు మాట్లాడుతూ పెద్దల సమక్షంలోనే కురువ సంఘం యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము రాజకీయాలకు అతీతంగా కురువ సంఘం పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పందెంలో పాల్గొనే పొట్టేళ్ల యజమానులు 500 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. శుక్రవారం లోపుగా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. పొట్టేళ్ల యాజమాన్యాలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. గుడిసె రవి 7993597043, గుడిసె గిరిబాబు 6305593137, రాజు 7995494618, రామాంజనేయులు 9573289871, విక్రమ్ 9390632545