శ్రీ భగవద్గీత జ్ఞాన మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్25 జమ్మికుంట టౌన్ రిపోర్టర్ తంగళ్ళపల్లి శ్యామ్ కిషోర్, ఈరోజు జమ్మికుంట శ్రీ భగవద్గీత జ్ఞాన మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సుమారుగా 35 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రమా సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు అయినారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేసి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడమైనది