శ్రీ పౌలస్తేశ్వరాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

★భక్తుల రద్దీతో శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయం

సాక్షి డిజిటల్ నవోంబర్ 06 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : జగిత్యాల్ జిల్లా నుండి 7 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి రోడ్డులో ఉన్న పొలాస గ్రామంలో పౌలస్తేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది.వ్యవసాయ పొలాలతో చుట్టుముట్టబడిన ఈ ఆలయం NH-16 కి సమీపంలో ఉంది, ఇది మంచి ప్రార్థనా స్థలం మరియు మంచి సందర్శనా స్థలం. ఇక్కడ పూజించబడే శివలింగం (స్వయం భూ) దాని ఆవిర్భావం నుండి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది. శ్రీ పౌలస్తేశ్వరాలయంలో కార్తీకపౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన, భక్తులు దానధర్మాలు చేస్తూ పుణ్యం సంపాదించుకుంటున్నారు.