శ్రీనివాస సత్రం బీచ్ ను పరిశీలించిన తహసిల్దార్

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 6 కోట మండలం, తిరుపతి జిల్లా: కోట మండల పరిధిలోని శ్రీనివాస సత్రం బీచ్ ను మండల తహసిల్దార్ జేజే రావు మెరైన్ పోలీసులు తో కలిసి తనిఖీలు నిర్వహించారు. సముద్ర తీరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మెరైన్ పోలీసులు, సివిల్ పోలీసు లతో కలసి చర్చించారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.