శరతులు లేకుండా సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి

★రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 06, రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: పత్తి రైతుల వద్ద ఎకరాకు ఏడు క్వింటల్ మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన ఎత్తివేసి, 20శాతం తేమ ఉన్నా ఎలాంటి షరతులు విధించకుండా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిరిపురం గ్రామంలో సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కురుస్తున్న తుఫాను మూలంగా నష్టపోయిన పత్తి పంటను పరిశీలించి,రైతులతో సమస్యలు అడిగి తెలుసుకొని అనంతరం మాట్లాడుతూ అప్పులు చేసి పెట్టుబడి పెట్టి చేత్తికొచ్ఛే సమయానికే వర్షాలు నిండా ముంచాయని ఇదిలా ఉంటే ఎకరాకు కేవలం ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం షరతులు పెట్టడంతో కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు శాంకేతిక అవగాహన లేక ముందస్తుగా నమోదు చేసుకోలేక పోవడంతో పత్తిని సీసీఐ కేంద్రాలు కొనుగోలు చేయడం లేదని అన్నారు. కొనక పోవడంతో నాలుగు వేల ధరకు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందన్నారు. కపాస్ కిసాన్ యాప్ తో కాకుండా టోకెన్ విధానంతో వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్నారు.ఎలాంటి శరతులు లేకుండా ఎకరానికి 12 క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని అన్నారు.తెమశాతం 20శాతం ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం పత్తి పంటపై విదేశీ సుంకం 11శాతం కు తగ్గించాలని చూస్తుందని అలా అయితే మద్దతు ధర తగ్గుతుందని రైతులకు నష్టం జరుగుతుందన్నారు. అధిక వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులకు ప్రభుత్వం ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు బల్గురి అంజయ్య,అంబటి సురేందర్ రెడ్డి,కునూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, సుభాష్ రెడ్డి, పల్లె సత్యం, కునూరు గణేష్, మల్లేష్, మార్త భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.