వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ( ఆత్మ) కమిటీ డైరెక్టర్లుగా వైభోగుల కొండబాబు యాదవ్, తిరుమలరాజు మురళి రాజు

★ఈనెల 7వ తేదీ జగంపేట కాపు కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారోత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ జగ్గంపేట నియోజకవర్గం ప్రతినిధి:బుజ్జి వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ( ఆత్మ) కమిటీ డైరెక్టర్లుగా జగ్గంపేట మండలం జగ్గంపేట కు చెందిన బీసీ యాదవ కులానికి చెందిన వైభోగుల కొండబాబు యాదవ్ ను, జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామానికి చెందిన క్షత్రియ కులానికి చెందిన తిరుమల రాజు మురళి రాజును ప్రభుత్వం నియమించింది. నవంబర్ 7వ తేదీ జగ్గంపేట గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నారు. యువ నేతలకు ఆత్మ కమిటీలో చోటు లభించడంతో పలువురు వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గ సంబంధించిన ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా నియమించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ కు, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభకు కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నానని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.