వీరులపాడు మండలం లో ఉద్యమం లా కోటి సంతకాల సేకరణ.

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కా నాగేశ్వరరావు, (06/11/2025, ) వీరులపాడు మండలం అల్లూరు, పెద్దాపురం జయంతి గ్రామాలలో మెడికల్ కాలేజీ ల ప్రవేటికరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. నందిగామ మాజీ శాసన సభ్యులు నియోజకవర్గ ఇంచార్జ్ మొండితోక జగన్మోహనరావు రచ్చబండ కార్యక్రమం లో ఎంపీపీ కోటేరు లక్ష్మి, మండల కన్వినర్ ఆవుల రమేష్ బాబు సీనియర్ నాయకులు ముత్తారెడ్డి పలువురు నాయకులతో కలసి పాల్గోని పత్రాల పై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
వైస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి పిలుపుతో మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ను వ్యతికిస్తూ ప్రజలు ముందుకొచ్చి కోటిసంతకాల సేకరణ ఉద్యమం లో పాల్గొనటం సంతోషకరం అని అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలభిస్తున్న కూటమి ప్రభుత్వo పై పోరాటానికి వైస్సార్సీపీ ప్రజల పక్షాన ఉంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాలను మోసం చేసిందని అన్నారు. అధికారం లోకి వచ్చిన ఆరు నెలల లోనే రాష్ట్రాన్ని దివాళా తీయించారని, రాష్టాన్ని సంక్షేమ నుండి సంక్షోభం లోకి నెట్టారని అన్నారు. రైతులకు పంటల నష్టపరిహారం లెక్కించడం లో సరైన విధానాలను అవలంభించ లేదని E-క్రాఫ్ నమోదు చేయకపోవటం, ఉచిత పంటల భీమా పథకాన్ని అతకేక్కించారాని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ లోపాలకి రైతులను బలి చేసిందని అన్నారు. నాడు జగన్మోహనరెడ్డి ఉచిత పంటల భీమా, రైతుభరోసా, RBK,ఇన్పుట్ సబ్సిడీ ల ద్వారా రైతులను ఆదుకున్నారని కానీ నేటి కూటమి ప్రభుత్వం లో ఆ పరిస్థితి లేదని తెలిపారు.