సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 6 కోట మండలం, తిరుపతి జిల్లా భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జన్మదినం సందర్భంగా గూడలి రాజుపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. కోట మండలం విద్యానగర్ ఎస్పీ మెడికల్ షాప్ ఫాన్సీ స్టోర్ యజమాని బుధవారం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 38వ జన్మదిన పురస్కరించుకొని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఫ్యాన్సీ స్టోర్ యజమాని, లైన్ మెన్ మల్లాo శ్రమేష్ ఆధ్వర్యంలో దేవా, వారి బృందం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చేత కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్ధులకు విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్,యువత పాల్గొన్నారు.