సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 6,2025 రిపోర్టర్ దాసరి శ్రీనివాస్, ఆసిఫాబాద్ పట్టణంలోని ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటవ తరగతి విద్యార్థులకు మంగళవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అధికారుల హోదాపై అవగాహన కల్పిస్తూ పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే విద్యార్థులకు చాక్లెట్లు పంచి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ కార్యాలయంలో విద్యార్థులతో ముచ్చటించి పోలీస్ విధుల గురించి తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి,రక్తనిధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, కూరగాయల మార్కెట్లను సందర్శించారు.ఈ పర్యటన విద్యార్థులకు ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించి నట్లయిందని ప్రిన్సిపాల్ రేష్మ తెలిపారు.