వరి పంటను పరిశీలిస్తున్న కెవికె.బనవాసి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. రాఘవేంద్ర చౌదరి,ఎఓ సుచరిత

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 6 , పెద్దకడబురు, మంత్రాలయం తాలూకా కర్నూల్ జిల్లా, రిపోర్టర్ గుడిసె శివరాజ్ : ఈఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంటలను బుధవారం పెద్దకడుబూరు మండల పరిధిలోని మేకడోనా,చిన్నతుంభళం గ్రామాలలో రైతులు సాగు చేసిన వరి పంటలను వ్వవసాయా శాస్త్ర వేత్తలు, మండల ఎఓ సుచరిత,కెవికె బనవాసి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి ఎఇఓ. నజ్రిన్ పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సుడి దోమ వరి పంటలో ఏ విధముగా గాయపరుస్తుందో రైతులకు వివరించారు. గాయపరచు విధానము: పెద్ద పురుగులు, పిల్ల పురుగులు వరి దుబ్బుల మొదళ్ళలో చేరి రసాన్ని పీలుస్తాయి. అందుచేత ఆకులు తెల్లగా ఎండిపోయినట్లు కనిపిస్తాయి. క్రమేపి మొక్కలు మొత్తం ఎండిపోతాయి మొక్కలు సుడులు సుడులుగా పొలంలో అక్కడక్కడ ఎండిపోతాయి. అందుచేత దీనిని ” సుడి తెగులు” అని అంటారు.అలాగే . పురుగు మొదట్లో పొలంలో అక్కడక్కడ అశించి ఒక వలయం ఆకారంలో పంటను నాశనం చేస్తుంది.ఈ పురుగు గ్రేసి స్టంట్, రేజ్డ్ స్టంట్ అనే వైరస్ తెగుళ్ళను కూడా వ్యాపింపజేస్తుంది.నివారణ చర్యలు: ప్రతి 2 మీటర్ల కు 20 సెంటీ మీటర్ల బాటను వదలాలి దీనినే అల్లేస్ అంటారు. అధిక నత్రజని వాడకాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల నిర్వహణ చేయాలి.అధేవిధంగా రసాయనిక పురుగు మందులైన ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ, ఫిప్రోనిల్ 1.0 మి.లీ, బుప్రోఫెజిన్ 2.0 మి.లీ, పైమెట్రోజిన్ 0.25గ్రా, డైనోటెఫ్యూరాన్ 0.3 గ్రా, థయోథినాక్స్ + ఫ్లానికామిడ్ 0.4 మి.లీ, ఎస్ఫెన్వాలరేట్ 5 EC ను 1.0 మి.లీ, డైనోటెఫ్యూరాన్ + పైమెట్రోజిన్ 0.26 గ్రా ఒక లీటరు నీటికి మందులను మార్చి మార్చి ఆకులు బాగా తడిచే విధంగా పిచికారి చేయడం వలన సమగ్రవంతంగా నివారించవచ్చు అనివారుతెలిపారు .వీరివెంటవిఎఎ. హరితేజ. రామేశ్వరీ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *