సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 96 మంది రోగులకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. అలాగే లయన్స్ కంటి ఆసుపత్రి రాకాసిపేట్ వారిచే కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఇర్ఫాన్ అలీ దంత వైద్యులచే దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన రోగులకు కంటి చుక్కల మందులు, దంత సమస్యలు ఉన్నవారికి పెప్సోడెంట్ టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు నొప్పుల మాత్రలు అందజేశారు. ఇందులో 12 మంది రోగులకు ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తము లయన్స్ కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ కెవి మోహన్ మాట్లాడుతూ..ఈరోజు నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి మంచి స్పందన వచ్చిందని వైద్యశిబిరం నిర్వహించుటకు పద్మశాలి సంగం కమ్యూనిటీ హాల్ ని అడిగిన వెంటనే సమ్మతం తెలిపిన సంఘం అధ్యక్షులు గెంటిల సాయిలుకు, సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, కోశాధికారి లయన్ ఇమ్రాన్, జిల్లా చైర్మన్ లయన్ శ్యామ్ సుందర్ పహడే, సీనియర్ సభ్యులు లయన్ ప్రవీణ్ కుమార్ కరంగుల, మెంబర్లు లయన్ పార్వతి ప్రశాంత్, లయన్ గాండ్ల మధు గ్రామ పెద్దలు మానింగ్ లింగం, క్యాంప్ ఇంచార్జ్ లయన్ హన్మంత్ రావు, పద్మశాలి సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు.