లంబాడిలను రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నవారిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి

★సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్ డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :6 ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ ఈ సమావేశానికి ఉద్దేశించి సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడిలపై కొంతమంది కావాలనీ రాజకీయంగా ఎదగాలనె దురుద్దేశంతో దృ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇలా అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లంబాడీలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఇప్పటివరకు పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేయకపోవడం చాలా బాధకరమని చెప్పారు కులాల మధ్య గొడవలు సృష్టించే వాళ్లపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని చట్టాలలో ఉన్నప్పటికీ అలాంటి వారిపై కేసు నమోదు చేయకపోవడం ఆంతర్యం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి విషయంపై పోలీస్ శాఖ వారు సమాధానం చెప్పాలని అన్నారు గిరిజన తెగల మధ్య ఇంతలా గొడవలు జరుగు తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర పోషించడం చాలా దారుణ మన్నారు ఇరువైపులా ఉన్న గిరిజన సంఘ నాయకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సరి కాదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి గిరిజన తేగల మధ్య ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఈ యొక్క సమావేశంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ జిల్లా ప్రచార కార్యదర్శి జరుపల లాలు నాయక్ జూలూరుపాడు మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్ పాల్వంచ మండల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయక్ కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు