సాక్షి డిజిటల్ న్యూస్. నవంబర్ 6. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గారంటీ లా పేరిట నిరుపేదలైన వ్యక్తులకు ఇందిరమ్మ. ఇండ్లు పూర్తిస్థాయిలో అందడం లేదు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు గ్యారెంటీలలో నామమాత్రము పథకాలుగా మాత్రమే మిగిలిపోయాయి పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయాలి అని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు గృహ జ్యోతి పథకం జన్నారం మండలంలో అమలులో జాప్యం జరుగుతుంది అని బాధితులు తెలిపారు రేషన్ షాపుల్లో సంచులపై ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి నామమాత్రపు ఆలోచనలతో మాత్రమే చేస్తున్నారని నిజమైన పేదలకు నిజాయితీగా ఏ పథకాలు అందడం లేదని పలువురు నిరుపేదలు కంట్రోల్ షాపుల దగ్గర మాట ముచ్చట చేస్తున్నారు ఇది జన్నారం మండలంలో జరుగుతున్న పరిస్థితి ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపుతున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీ సెక్రెటరీల నుండి అందినట్లయితే మండల స్థాయిలో అన్ని గ్రామాల్లో న్యాయం జరుగుతుంది అన్నారు .