రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కోట ఏవీకేఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 5 కోట మండలం, తిరుపతి జిల్లా : నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన డిస్క్ త్రో అండర్ 17 పోటీల్లో కోట ఎవికెఆర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్దులు పదవ తరగతి విద్యార్థి పాకం గౌతమ్ జిల్లా స్థాయిలో జరిగిన డిస్క్ త్రో పోటీల్లో విజయం సాధించగా,8వ తరగతి విద్యార్థిని భవ్యశ్రీ 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం,200మీటర్ల పందెంలో 3 వ స్థానం,80 మీటర్ల హుడ్లర్ లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారని ఆపాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వల్లీ అహ్మద్ తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు వారికి అభినందనలు తెలిపారు