సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలుగు పూడి గురుకులం పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కాబడ్డారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలలో గురుకుల పాఠశాల విద్యార్థులు బంగారు పథకాలను కైవసం చేసుకున్నారు.ఈ నెల 4వ తేదీన జిల్లా పరిషత్ హై స్కూల్ పాతవలస, కె,కోటపాడు మండలంలో జరిగిన పోటీల్లో జి, జస్వంత్ 8 వతరగతిసిహెచ్ అశోక్ 9 వ తరగతి రాణించి బంగారపాతకాలు సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాబడ్డారని పాఠశాల ప్రధానా చార్యులు ఎస్,విక్టర్ పాల్ తెలిపారు ఉపాధ్యాయ సిబ్బందివిద్యార్థులును అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఈనెల 27వ తేదీన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోటీలు జరగనున్నాయని తెలిపారు. విద్యార్థులను విజయపథంలో నడిపిన పిఈటి తరుణ్, పిడి ఉమామహేష్, సేవలను ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. విశాఖపట్నం జిల్లా డిసిఓ గ్రేస్, స్కూల్ కమిటీ చైర్మన్ ఇరట నరసింహమూర్తి మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థులను అభినందించారు.