రామారావును హత్య చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలి

★కామేపల్లి మండల సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి బాధవత్ శ్రీను

సాక్షి డిజిటల్ న్యూస్,కామేపల్లి (నవంబర్ 6) : సిపిఎం పార్టీ జిల్లా నేత సామినేని రామారావు హత్యపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ కామేపల్లి మండల కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం సిపిఎం పార్టీ కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కామేపల్లిలో సామినేని రామారావును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కామేపల్లి మండల సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి బాధావత్ శ్రీను మాట్లాడుతూ..హత్య రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు. రామారావును హత్య చేయటం చాలా దారుణమని తీవ్రంగా ఖండించారు.హత్య చేసిన దుండగులను వెంటనే పోలీసులు అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోని శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటన మరల పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కామేపల్లి మండల కమిటీ సభ్యులు బాలకృష్ణ, ఏర్పుల శాంతయ్య, సత్యనారాయణ, ఎస్ కె.హుస్సేన్, కిన్నెర రామచంద్రయ్య, రామకృష్ణ, వీరభద్రం, నరేష్, లావుడియా బావుసింగ్, రాయల వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.