రాజరాజేశ్వరునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

★కామరెడ్డి జిల్లా బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 పిట్ల మండలం భూమయ్య రిపోర్టర్ పిట్లం మండల కేంద్రంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజ నిర్వహించిన కామారెడ్డి జిల్లా బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర దేవాలయంలో బుధవారం నాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివునికి యాదగిరి దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి పూలహారం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్తికమాసంలో తులసి పూజలు ప్రతి ఒక్కరు ఇంటిలో మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించి దీపారాధన చేస్తారు. మరియు దీపారాధనతో దేవాలయాలలో ప్రత్యేక దీపారాధనతో కలకలలాడుతూ శోభన సందర్శించుకుంటాయి భక్తులు కొత్త బట్టలు ధరించి ఆలయాలకు వెళ్లి జ్యోతి వెలిగించి తమ మొక్కును కోరికలను చెల్లించుకుంటారనీ వారు అన్నారు.