సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 06:రిపోర్టర్ చిట్యాల తిరుపతి, సిద్దిపేట జిల్లా,కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొన్నారు.ఉత్సవాలు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాల్లో పాల్గొన్నారు. విజయదుర్గామాతకు విశేష పూజలు నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు అనంతరం సుబ్రహ్మణ్య స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు పూజలు, అభిషేక కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొన్నారు క్షేత్రం ఆవరణలోని ఉసిరి చెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.కొందరు భక్తులు లక్ష వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులను చెల్లించుకున్నారు అనంతరం జరిగిన నవావరణ హవనంలో జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమం లో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు చీకోటి రాజేంద్రప్రసాద్ దేవసాని మల్లేశం,లగిశెట్టి రాజు మర్యాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.