మండలంలో రేగా పర్యటన

సాక్షి డిజిటల్ పినపాక ప్రతినిధి నవంబర్ 6, అశ్వాపురం మండలంలో బుధవారం పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మొండికుంటలో అశ్వాపురం మాజీ ఎంపీపీ కొల్లుమల్లారెడ్డి సతీమణి కొల్లు లక్ష్మమ్మ ఇటీవల హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించుకుని స్వగృహానికి రావడంతో వారిని పరామర్శించి, అదే గ్రామంలో బుధవారం ఎడ్ల సైదిరెడ్డి పరమపదించటంతో వారి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి , సీనియర్ నాయకులు కాసరబాద శ్రీనివాస్,మిట్ట కంటి వెంకటరెడ్డి,వెంగళ బిక్షం రెడ్డి, వల్లభనేని వసంతరావు,ఎడ్ల ప్రతాపరెడ్డి,శ్యామల యాదగిరి రెడ్డి,శ్యామల పుల్లారెడ్డి,పాయం సీతారాములు,మొండికుంట గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాటి మన్మధ రెడ్డి,రామగిరి భాస్కర్, బీసీ సెల్ నాయకులు తాటిపాముల రమేష్ బొడ్డోజు రామాచారి,అంబటి కర్ర శ్రీను,పాయం ఎర్రయ్య,కళ్లెం సత్తిరెడ్డి, బిరెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.