సాక్షి డిజిటల్ న్యూస్ 5 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో పరదేశమ్మ అమ్మవారి గుడి వద్ద బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు కార్తీ మాసము పురస్కరించుకొని భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమపూజలు నిర్వహించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు లక్ష్మి గణపతి ఆలయం తరఫున తా రువా టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు అల్లు సరోజ శ్రీనివాసరావు పరదేశమ్మ ఆలయానికి సీలింగ్ ఫ్యాన్ బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భజన గురువు సబ్బవరపు సత్యం టిడిపి నాయకులు యాళ్ల అప్పలనాయుడు కై చర్ల సూరిబాబ చిటికెల వెంకటరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు