భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమిభక్తులతో పోటెత్తిన శివాలయాలు

సాక్షి డిజిటల్ న్యూస్ 5 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు కార్తీ పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో బుధవారం రాత్రి కిటకిట లాడాయి సాయంత్రం సమీపంలోనిశారద నదిలో మహిళలు కుటుంబ సభ్యులతో పుణ్య స్నానాలు ఆచరించారు రాత్రి ఉమామహేశ్వర దేవి వెంకటేశ్వర స్వామి రామాలయలను దర్శించుకుని వేద మంత్రోచ్ఛరణ నడుమ ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించుకున్నారు ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతో దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి