బనగానపల్లె లో ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ 6నవంబర్ 2025 నంద్యాల జిల్లా బనగానపల్లె రిపోర్టర్ రాంబాబు బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయావరణలో ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏపీడబ్ల్యూజేఎఫ్ బనగానపల్లె డివిజన్ అధ్యక్షులు గుండం సర్వేశ్వర రెడ్డి ,ఉపాధ్యక్షులు ఆంధ్ర అక్షర రామచంద్రారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నేను సైతం మధు,సూర్య నరసింహారెడ్డి ,కార్యదర్శి స్వతంత్ర న్యూస్ షాషావలి ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాల చెన్నయ్య, కార్యదర్శి సూర్య రాజేష్, నాయకులు టీవీ5 సుబ్బయ్య, ఆర్ టి వి ఓబులేష్, రాజ్ న్యూస్ వేణుగోపాల్ రెడ్డి, బాలయ్య మనోహర్, దస్తగిరి వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు