ప్రజలవద్దకు ప్రభుత్వ పథకాలు

★సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5 తిరుమలగిరి మండల రిపోర్టర్ బాకీ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల అధికారుల ఆదేశాల మేరకు మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ సమావేశంలో మాట్లాడినారు అదేవిధంగా ఆరూ గ్యారెంటీలు పరిసరాల పరిశుభ్రత సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి టీం లీడర్ పల్లె లక్ష్మణ్ కళాబృందం చేత వివిధ కళారూపాలతో ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించినారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెల రాము. గంట బిక్షపతి. గడ్డం ఉదయ్. మాగి శంకర్. పాక ఉపేందర్.మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. కుందమల్ల నాగలక్ష్మి. ములకలపల్లి మల్లమ్మ. గ్రామపంచాయతీ సిబ్బంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.