పొలాల్లో పరుగులు తీస్తున్న కృష్ణా నది జలాలు

★పండగ వాతావరణం లో పల్లె రైతులుసంబరాలకు సిద్ధమవుతున్న జనం

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా సాగుకు నోచుకోక బీడుగానున్న పొలాల్లో కృష్ణానది జలాలు పరువలు తొక్కుతున్నాయి దీంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొని సంబరాలు జరుపుకునేందుకు జనం సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27వ తేదీన కృష్ణానది జలాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోనున్న పరమ సముద్రం చెరువుకు నీటిని విడుదల చేశారు అప్పటినుండి రామకుప్పం మండలంలోని పలు చెరువులు నిండాయి అనంతరం అనుసంధానం గానున్న చెరువులకు నీరు వెళ్లడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా అత్తి కుప్పం చెరువు నుండి మనేంద్రం చెరువుకు నీరు చేరుతుంది దీంతో పలు పొలాలు నిండి నీరు ప్రవహించి సమీపంలోనున్న బావులు బోర్లలో నీరు పెరిగి రైతుల్లో ఆనందం వ్యక్తం అయింది అదే విధంగా చింతకుప్పం వద్దనున్న జిల్లా అని చెరువు నిండి ప్రవహిస్తోంది ఈ నీరు కృష్ణరాజుపురం ముద్దులంక గాంధీ నగరం రెడ్డి వాని పోడు గ్రామ సమీపంలో నున్న పొలాలను తాకుతూ చిన్నచిన్న కుంటలు కల్వట్లు నుండి సప్లై ఛానల్ ద్వారా కంచన బల్ల చెందిన తోట్ల చెరువులోకి కృష్ణాజలాలు పరువలు తొక్కుతున్నాయి దీంతో పరిసరాల్లోనున్న పొలాలు నిండి బావులు బోర్లలో నీటి శాతం పెరుగుతుంది దీంతో రైతులు పట్టలేనంత ఆనందంతో సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అత్తి కుప్పం చెరువు నందు గ్రామస్తులు సంబరాలు చేసుకోవడం జరిగింది అనంతరం చింతకుప్పం గ్రామస్తులు సంబరాలకు సిద్ధమవుతున్నారు గతంలో వ్యవసాయ సాగుకు మరియు తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలు అందించడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది నిత్యం వ్యవసాయానికి నీరు లభించడంతో రైతుల ఆనందానికి అంతులేకుండా పోయింది రైతులకు ప్రధానంగా వ్యవసాయ సాగుకు నీరు కావాల్సి ఉంది ఈ నీరు సమృద్ధిగా లభించడంతో కొండంత సంతోషంతో ముందుకు వెళ్తామని రైతుల పేర్కొంటున్నారు ఏది ఏమైనా మండలంలో అంచలంచలుగా చెరువులు మీరు చేయడం ఆనందంగా మారింది ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు విజాలాపురం సింగసముద్రం గొల్లపల్లి లలోని చెరువులకు నీళ్లు చేరాయి తగ్గిన చెరువులకు కృష్ణా జలాల ద్వారా మీరు చేరుతుందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.