పేరు సోముల కంబగిరి స్వామిని దర్శించిన తెలంగాణ స్పీకర్

సాక్షి డిజిటల్ న్యూస్ 5నవంబర్ 2025 కోవెలకుంట్ల సంజామల మండలం రిపోర్టర్ రాంబాబు తెలంగాణ స్పీకర్ ను కలిసిన బీసీ నాయకుడు వడ్డే సుబ్బరాయుడు బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సంజామల మండలం పేరుసోముల లోని కంబగిరి స్వామి ఆలయంలో రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, ఎస్సై లు మల్లికార్జున్ రెడ్డి, రమణయ్య , సంజామల తహసిల్దార్ అనిల్ కుమార్ లు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతోపాటు మేళతాళాలతో స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరుగుతున్న హోమ యాగ ల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. కంబగిరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి జరిగిన అభిషేక ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని దేవు న్నీ ప్రార్థించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో వర్షాలు అధికమై ,అకాల వర్షాలు రైతాంగానికి నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు. వర్షాలు తగ్గి రైతులకు మేలు జరగాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డె సుబ్బరాయుడు మర్యాదపూర్వకంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో బీసీల అభివృద్ధిపై చర్చించారు. తెలంగాణలో బీసీలను ఏబిసిడిలు గా వర్గీకరించి కులాల నిష్పత్తి ప్రకారం విద్యా ,ఉద్యోగ ఉపాధి,రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వంతో చర్చలు జరపాలని స్పీకర్ ను వడ్డే సుబ్బరాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకుల తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.