సాక్షి డిజిటల్: నవంబర్ 6, అశ్వరావుపేట ఇంచార్జ్,"బుల్లా శివ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన నిరుపేదలకే కేటాయించాలని.ఆధారపార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. బుధ వారం భద్రాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా ములకలపల్లి ఎంపీడీవో రామారావుకు వినతిపత్రం అందించారు. ఇందిరమ్మ ఇళ్ళను నిరుపేదలకు కాకుండా కొంతమంది ఆర్థికంగా ఉన్న వారికే ఇస్తున్నారని, దీనివల్ల నిరు పేదలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. గ్రామాలలో సర్వే చేపట్టి అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని కోరారు. అర్హులను వదిలిపెట్టి వేరే వారికి కేటాయిస్తే తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని సహకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పినపాక నియోజకవర్గం ఇంచార్జ్. పూనం నరష్, అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ వూకే ముత్తయ్య దొర,ఆధార్ పార్టీ మండల అధ్యక్షుడు వూకే నాగేశ్వరరావు, జడ్పిటిసి అభ్యర్థి, మరియు నాయకులు, బాధ్యులు పాల్గొన్నారు.