సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 06, రిపోర్టర్, విశాఖపట్నం జోన్ 5 మురళి నగర్ పరిసర ప్రాంతాలలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న ఇప్పటివరకు ఏ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు గడచిన కొంతకాలంగా ఆదాయమే పరమార్ధంగా బిల్డర్స్ వ్యవహరిస్తున్నారు, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా సెటబాక్స్ లేకుండా అదనపు అంతస్తులతో భవన నిర్మాణాలు చేపడుతున్నారు ఇటువంటి నిర్మాణాల వల్ల ఫ్లాట్ యజమానుదారులు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ ఓనర్స్ లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ నిర్మాణాలకి ఒక చట్టబద్ధమైన ప్లానింగ్ తీసుకుని దానిని ఉల్లంఘిస్తూ అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు ఇటువంటి నిర్మాణాలపై అనేకసార్లు ఫిర్యాదుల అందినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ సచివాలయం సిబ్బంది గానీ తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరికలను ఉల్లంఘిస్తూ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఎదొచ్చుగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు ఇటువంటి నిర్మాణాలపై ఏసీపీ తిరుపతిరావు టీపీవో ప్రవీణ్ తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.