ధర్పల్లి లో విజయవంతంగా ముగిసిన బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం

★బీసీ లందరూ ఏకమవ్వాలి జేఏసీ పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ఎన్నికల్లో వెనుకబడిన బలహీణ వర్గాల వారికి బీసి రిజర్వేషన్ కల్పించాలని, ధర్పల్లి మండల జేఏసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా… ముఖ్య అతిథులుగా మానవ హక్కుల వేధిక జిల్లా అధ్యక్షురాలు సరిత పాల్గోన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి సరిత మాట్లాడుతూ.. రానున్నా స్థానిక ఎన్నికలలో వెనుకబడిన బడుగు బలహీణ తరగతుల కుటుంబాల నుండి ఎన్నికలలో నిలబడితే ప్రజలు యువకులు ప్రతి ఒక్కరూ బిసి కులాలు ప్రతీ కుటుంబాలు అభివృద్ధి చెందాడానికి రాష్ట్ర, కేంద్రా ప్రభుత్వాలకు వెనుక బడిన బలహీన వర్గాల తరగతుల ఉద్యమాలు ప్రతీ గ్రామంలో చేపట్టి బీసిలకి 42% శాతం కచ్చితంగా రానున్న ఎన్నికలలో అవకాశం కల్పించాలని, బీసి అన్ని వర్గాల నాయకులు పోరాడుతే హైకోర్టు నుండి ఖచ్చితంగా వెనుకబడిన తరగతులకు మద్దతుగా జీవో న్యాయస్థానం తీర్పు ప్రకటించే వరకు ఉధ్యమం ఆపవద్దని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమంలో భాగంగా కార్యవర్గాన్ని తత్కాలికంగా ఎన్నుకున్నారు. ధర్పల్లి బీసీ జేఏసీ కన్వినర్గా సంబేటి సుమన్, కో కన్వీనర్ చెలిమేల నర్సయ్య, సభ్యులు మంచికంటి ప్రశాంత్, బాలయ్య, మచ్చ రఘురాం, డాక్టర్ ఆనంద్, ఎల్ సతీష్ గౌడ్ (దుబ్బాక్) రేకులపల్లి కిరణ్ గౌడ్, గోవింద్ పల్లి కనకం రాజేందర్, లుగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మాణం చేశారు.