సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 2025 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్ తెలంగాణా శబరిమల గా పేరుగాంచిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సూచనలతో దీక్షా ధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ ముప్పైయ్యవ (30) రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సుమారుగా 500 మందికి పైగా స్వాములు బిక్ష స్వీకరించినారు. ఈనాటి కార్యక్రమం నకు దాతలుగా మాజి శాసనసభ్యులు శ్రీ వేనేపల్లి చందర్ రావు - నిర్మల దంపతులు మరియు, అద్వైత్ సాయి,సాధు బ్రహ్మానందం సార్ వ్యవహరించినారు ఈ కార్యక్రమం లో కొండపల్లి వాసు గురుస్వామీ, సాధు బ్రహ్మానందం, విశ్వనాధ చారీ, మునింద్ర చారీ,నరసింహారావు, ఐ. వెంకటేశ్వర్లూ, తదితరులు పాల్గొన్నారు.
