డేంజర్ జోన్ గా మారిన కొత్తబస్టాండ్ నడి రోడ్డు పెట్రోల్ బంక్

★భద్రతా నిబంధనలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు విరుద్ధంగా

సాక్షి డిజిటల్ నవోంబర్ 06 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : జగిత్యాల పట్టణ కొత్తబస్టాండ్ కూడలిలో నడి రోడ్డున గల సర్వే. నo.138 లో ఉన్న 20 గుంటల ప్రభుత్వ భూమి, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా అక్రమంగా ఎన్నో ఏళ్లుగా కబ్జా చేయడమే కాకుండా పట్టణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచి ఎన్నో ప్రమాదాలకు కారణం అయ్యింది. భద్రతా నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నడి రోడ్డుపై ఉండకూడదు. పెట్రోల్ బంకులు రోడ్డు పక్కన నిర్దిష్ట దూరంలో మరియు భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడతాయి. ఇవి ట్రాఫిక్‌కు అడ్డుపడకుండా మరియు ప్రమాదాలను నివారించడానికి ఇలా చేస్తారు. నిబంధనలు: పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇవి నివాస ప్రాంతాలకు మరియు ఇతర సున్నితమైన ప్రదేశాలకు ఒక నిర్దిష్ట దూరం దూరంలో ఉండాలి. భద్రత: పెట్రోల్ బంకులు అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలి. ఇంధనం నింపే ప్రక్రియ సురక్షితంగా ఉండేలా చూస్తారు. ట్రాఫిక్: పెట్రోల్ బంకులు రోడ్డుకు అడ్డంగా ఉండవు. రోడ్డుపై నిలిచిపోవడం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుంది. అందుకే అవి రోడ్డు పక్కన నిర్దిష్ట స్థలంలో ఏర్పాటు చేయబడతాయి. పెట్రోల్ బంకుకు సంబంధించి నిత్యము అనేక వార్తా పత్రికల్లో, వార్తా ఛానళ్లలో రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్పందించి జగిత్యాల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ నేతృత్వంలోని విచారణ కమిటీని వేశారు.మున్సిపల్‌ భూమి ఆక్రమణపై పూర్తి విచారణ జరిపి నివేదికను అందజేయాలని
కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) రాజాగౌడ్‌ను కమిటీ చైర్మన్‌గా, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, అర్బన్‌ తహసీల్దార్‌ రాంమోహన్‌, జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ స్పందనను సభ్యులుగా నియమించారు. భద్రతా ప్రమాణాలకు విరుద్ధం- ప్రజల ప్రాణాలకు ప్రమాదం పెట్రోల్ బంకు వల్ల పట్టణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచి ఎన్నో ప్రమాదాలకు కారణం అయిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని, పెట్రోల్ బంకును అక్కడినుండి తక్షణమే తీసివేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని జగిత్యాల జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు, ప్రభుత్వ ఆస్తిని కాపాడే హక్కు ప్రతీ ఒక్కరీ భాద్యత అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరడం జరిగింది.