సాక్షి డిజిటల్ న్యూస్:నవంబర్ 6,నంద్యాల జిల్లా,శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. స్వయంగా హాజరై భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో గంగాధర మండపం వద్ద జరగనున్న జ్వాలాతోరణం కార్యక్రమానికి స్వయంగా హాజరై భక్తుల భద్రత,బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గుడి పరిసర ప్రాంతాలు,గంగాధర మండపం,క్యూలైన్లు,నంది మండపం తదితర ప్రాంతాలలో పర్యటించి.ఈ జ్వాలాతోరణం కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని ముఖ్యమైన కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.భక్తులు పోలీసు వారి హెచ్చరికలను సూచనలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.