జూబ్లీహిల్స్ లోబిఆర్ఎస్ దే విజయం

*మాగంటి సునిత భారీ మెజార్టీతో గెలుపు ఖాయం *జూబ్లీహిల్స్ లో ఇంటింటా నిర్వహించిన ప్రచారంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ

సాక్షి డిజిటల్ న్యూస్,కామేపల్లి (నవంబర్ 6) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునిత భారీ మెజార్టీతో విజయం సాధించనున్నదని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ ధీమా వ్యక్తం చేశారు.బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ మాలోత్ కవిత సూచనల మేరకు సునిత విజయాన్ని కాంక్షిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని బోరబండ, నందానగర్,ఎర్రగడ్డ,యూసుఫ్ గూడ,రహమత్ నగర్, శ్రీనగర్ కాలనీలో ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులుతో కలసి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందలేదని,ఎన్నికలకు ముందు చేసిన హామీలు నెరవేరలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య,పార్టీ ప్రధాన కార్యదర్శి కాంట్రాల రాంబాబు,
మండల పార్టీ ఉపాధ్యక్షులు మల్లెంపాటి శ్రీనివాసరావు,సామా మోహన్ రెడ్డి,వడియాల కృష్ణారెడ్డి,పార్టీ సీనియర్ నేతలు మూడ్ కృష్ణ ప్రసాద్,రాయల వెంకన్న,అజ్మీర రాజు, పుచ్చకాయల బాబు,మాజీ సర్పంచులు లకావత్ భీమా,జాటోత్ జాయ్ లూసీ, గడ్డం వెంకన్న,ఆధూర్తి ప్రసాద్, పాలెం మధు,అజ్మీర కుమార్, కడారి సైదులు,మోరి మేకల నాగయ్య,కడారి పరమేష్,శ్రీను, నిమ్మల సైదులు,పుచ్చకాయల ఉదయ్ కిరణ్,శ్రీను,రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *