జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార రణరంగంలో కొత్తగూడెం ప్రధాన పార్టీలు

★టి పి సి సి సభ్యులు సీతారాములు సారధ్యంలో కాంగ్రెస్ నాయకులు. ★మాజీ మంత్రి వనమా కను సైగలలో బి ఆర్ ఎస్ నాయకులు.

సాక్షి డిజిటల్ న్యూస్ కొత్తగూడెం కాన్స్టెన్సీ ఇన్చార్జ్ పనిత మార్కు నవంబర్ 6 హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వేడెక్కిన ఎన్నికల హడావుడి కి కదిలిన కొత్తగూడెం నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ లో గెలుపును సవాలుగా తీసుకొని కొత్తగూడెం నియోజకవర్గంలో అన్ని మండలాల నుండి ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు పల్లెలను వదిలి మహానగరంలో తిష్ట వేశారు. వెళ్లిన వారిలో ఎమ్మెల్యే స్థాయి నుండి చిన్న కార్యకర్తల వరకు ఇంటింటి ప్రచార రంగంలో ఎవరికివారు దూసుకుపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ యాదవ్ ను గెలిపించి కాంగ్రెస్ పార్టీ కి జూబ్లీహిల్స్ తో పాటు మహానగరంలో కొత్త ఉత్సాహాన్ని తెప్పించాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటే బి ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిపించి మహానగరంలో బి ఆర్ ఎస్ కు ఉన్న స్థానాన్ని ప్రజలలో గట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని బి ఆర్ ఎస్ నాయకులు ప్రచారంలో సాగిపోతున్నారు. జూబ్లీహిల్స్ గెలుపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపబోతుందని ఇరు పార్టీలు తమ అభ్యర్థి గెలుపు కోసమే హైదరాబాదులో పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. ఇరు పార్టీలు తమ అభ్యర్థులని గెలిపించడమే ధ్యేయంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనే ఉండి ప్రయత్నిస్తున్నారు. ఎవరి కష్టానికి ఫలితం రానుందో ఎవరి అభ్యర్థి కి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టనున్నారో అన్న విషయం పై ఉత్కంఠ పోరుకు తెరపడాలి అంటే నవంబర్ 14 వ తారీకు వరకు వేచి చూడాలి.