సాక్షి డిజిటల్ న్యూస్:6 నవంబర్,పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప-ఎన్నిక సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు, బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తో కలిసి షేక్ పేట్ డివిజన్ ఇంచార్జ్ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గద్దల రమేష్ పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతోనే సాధ్యమవుతుందని నియోజక వర్గ ఓటర్లకు తెలియచేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.