జనసేన ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత పనులు

సాక్షి డిజిటల్ న్యూస్ బలిజిపేట మండల రిపోర్టర్ సిహెచ్ మురళి బలిజిపేట మండలం అరసాడ గ్రామంలో బీటి రోడ్డు పై ఉన్న మరమ్మత పనులను బుధవారం జనసేన పార్టీ నాయకులు, పార్వతిపురం మన్యం జిల్లా పిఓసి ఆదాడ మోహానరావు ఆదేశాల మేరకు మరమ్మత పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన రహదారి తుఫాన్ ప్రభావం వలన పూర్తి స్థాయిలో మరమతులకు గురైందని సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమం చేపట్టడం వలన గ్రామ ప్రజలు స్థానికులు హర్షణ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు సిహెచ్ మురళి పి జయరాం జి సత్య ఎం శ్రీనివాస్ సూర్యనారాయణ పోలిరాజు కృష్ణ మురళి గొడుబ పార్వతి పార్వతి ఈశ్వరమ్మ లక్ష్మమ్మ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.