సాక్షి డిజిటల్ న్యూస్ 6నవంబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్ చైర్మన్‌గా జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సభ్యులుగా జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ మున్సిపల్ కమిషనర్ స్పందన జగిత్యాల పట్టణ నడిబొడ్డున కొత్తబస్టాండ్ సర్కిల్ లోగల సర్వే. నo.138 లో ఉన్న 20 గుంటల భూమి సుమారు 100 కోట్ల విలువగల ప్రభుత్వ ఆస్తిని,రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా అక్రమంగా ఎన్నో ఏళ్లుగా కబ్జా చేయడమే కాకుండా పట్టణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచి ఎన్నో ప్రమాదాలకు కారణం అయ్యి అటు ప్రభుత్వాన్ని ఇటు న్యాయస్థానాన్ని మోసం చేస్తున్న కబ్జాకోరుల మీద అలాగే మీద కఠినమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని జగిత్యాల జిల్లా ప్రజలు,ప్రజా సంఘాలు,నాయకులు,ప్రభుత్వ ఆస్తిని కాపాడే హక్కు ప్రతీ ఒక్కరీ భాద్యత అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరడం జరిగింది.దీనికి సంబంధించి నిత్యము అనేక వార్తా పత్రికల్లో,వార్తా ఛానళ్లలో రావడం జరిగింది.దీనికిజిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ నేతృత్వంలోని విచారణ కమిటీని వేశారు.మున్సిపల్ భూమి ఆక్రమణపై పూర్తి విచారణ జరిపి నివేదికను అందజేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీ రాజాగౌడ్‌ను కమిటీ చైర్మన్‌గా, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్,అర్బన్ తహసీల్దార్ రాంమోహన్,జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందనను సభ్యులుగా నియమించారు.మూడు నాలుగు రోజుల వ్యవధిలో మున్సిపాలిటీకి సంబంధించిన 20 గుంటల భూమిపై సంపూర్ణ విచారణను జరిపి నివేదికను అందించాలని ఆదేశించడంతోపాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ,మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు.