చిన్న రాజారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి

సాక్షి డిజిటల్ నవంబర్ 6 బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు.. అల్లూరు గ్రామ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు.. సొసైటీ మాజీ సభ్యులు అక్కల చిన్న రాజారెడ్డి అనారోగ్యంతో రాత్రి స్వగ్రామం అల్లూరు లో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ సిపి బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు అల్లూరు గ్రామానికి వచ్చి చిన్న రాజారెడ్డి భౌతికాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పిట్టలవానిపాలెం మండల అధ్యక్షు లు ఉయ్యూరి లీలా శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు వాలి శివారెడ్డి, మండే విజయ్ కుమార్, బడుగు ప్రకాష్, శివకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు