ఘనంగా జీసిసి ఉద్యోగి షష్టిపూర్తి మహోత్సవ వేడుకలు

★జి. మాడుగులలో జిసిసి అకౌంటెంట్ రామచంద్ర రాజు దంపతులను పూలదండలు వేసి సాల్వాలు కప్పి ఘనంగా సత్కరిస్తున్న మాజీ ఎంపీపీ వైయస్సార్ నియోజకవర్గం నాయకుడు వెంకటగంగరాజు టిడిపి సీనియర్ నాయకుడు రామరాజు

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 05, జి.మాడుగుల: గిరిజన సహకార సంస్థ ( జిపిసి ఎం ఎస్) బ్రాంచ్ ఆధ్వర్యంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న మత్స్యరాస రామచంద్రరాజు, రత్నాలమ్మ దంపతులు షష్టిపూర్తి మహోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగింది. రామచంద్రరాజు దంపతులను మాజీ ఎంపీపీ వైఎస్ఆర్సిపి నియోజకవర్గం సీనియర్ నాయకుడు మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి),టిడిపి సీనియర్ నాయకుడు మత్స్యరాస రామరాజు, స్థానిక నాయకులు బొజ్జ అర్జున్ రావు, వెంకటరమణ, పూలదండలు వేసి శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు జడ్పిటిసి సభ్యురాలు కిముడు గాయత్రీదేవి, విజయ్,గిరి, బలంనాయుడు, తదితరులు పాల్గొన్నారు