గిరిజన ఉద్యమ కెరటం ధర్మజిల్లా ప్రజలకు ధర్మ అందించిన సేవలు చిరస్మరణీయం

★సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని

సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్: 6 ) గిరిజనముల సంక్షేమం హక్కుల పరిరక్షణకోసం గుగులోత్ ధర్మ నిర్వహించిన ఉద్యమాలు నేటితరానికి ఆదర్శమని ఆయనలేని లోటు తీర్చలేనిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు గిరిజన నేత గుగులోత్ ధర్మ ద్వితీయ వర్ధంతి సందర్బంగా సుజాతనగర్ మండలంలోని మంగపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధర్మ విగ్రహావిష్కరణ సంతాపసభలో అయన పాల్గొని మాట్లాడారు. గుగులోత్ ధర్మ ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాలకు దిక్షుచిలాంటివారని ఎన్నో ప్రజా రైతు గిరిజనోద్యమాలకు నాయకత్వం వహించారని ప్రజలకు ఒక్కతాటిపైకి తెచ్చి ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారా సమస్యల పరిష్కరంకోసం నిరంతరం శ్రమించాడని కొనియాడారు. అనంతరం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మండల నాయకులు భూక్యా దస్రు కుమారి హన్మంతరావు, జక్కుల రాములు తదితరులు పాల్గొన్నారు.